హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ఒక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈ హీరో వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. పటాస్ తరువాత  ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేదు. ఇక ఇప్పుడు కమర్షియల్ హిట్ ఎలాగైనా అందుకోవాలని చూస్తున్నాడు. 

118 అనే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చూస్తుంటే సినిమా ప్రయోగాత్మకంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రముఖ సినిమాతో గ్రాఫర్ కెవి.గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక షూటింగ్ పనులు గత నెలలోనే ముగిశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేయడంలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. 

మహేష్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నివేత థామస్ - షాలిని పాండే హీరోయిన్స్ గా నటించారు. ఇక జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలనీ కళ్యాణ్ రామ్ నిర్మాతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.