నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం 118 రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. సమ్మర్ స్టార్టింగ్ లోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కెవి.గుహన్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

టైటిల్ తోనే ఆకర్షిస్తోన్న ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అదే విధంగా సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేందుకు 118 గ్యాంగ్ సిద్ధమైంది. ఈ సినిమా కోసం హీరో కళ్యాణ్ రామ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ప్రతి సన్నివేశం రియలిస్టిక్ గా ఉంటుందని టాక్. 

ఇక 2015లో వచ్చిన పటాస్ తరువాత ఈ హీరో ఇంతవరకు హిట్ అందుకోలేదు. చివరగా వచ్చిన నా నువ్వే సినిమా అయితే నిర్మాతలకు భారీ నష్టలను మిగిల్చింది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే - నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.