#Naasaamiranga:'నా సామి రంగ' డైరక్ట్ చేయమని మొదట ఆ డైరక్టర్ నే అడిగారా
ఈ మళయాళి రీమేక్ ను మొదట రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ డైరక్ట్ చేద్దామనుకున్నారు.అయితే రకరకాల కారణాలతో వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ ఆఫర్..
సైలెంట్ గా సంక్రాంతిబరిలోకి దిగి జెండా ఎగరేశారు నాగార్జున . కేవలం మూడు నెలల కాలంలో చిత్రనిర్మాణాన్ని పూర్తి చేసి, ఎక్కడా ఎవ్వరినీ నొప్పించకుండా సజావుగా షూటింగ్ కార్రక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతికి నా సామిరంగాని పందెం కోడిని వదిలినట్టుగా వదిలారు. ఈ సినిమా మంచి హిట్టై మళ్లీ నాగార్జునని ఫామ్ లోకి తెచ్చింది.దర్శకుడు విజయ్ బిన్ని ఈ క్రెడిట్ నంతా థాంక్స్ గివింగ్ మీట్ లో తన యూనిట్ కే ఇచ్చాడు. తనకున్నలాటి డెరెక్షన్ టీం ఎవరికున్నా ఇంతే స్పీడుగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పి టీంకి థాంక్స్ చెప్పాడు.
ముఖ్యంగా సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగా పండింది. నరేష్ పెరఫారమెన్స్ మరో పెద్ద ప్లస్ పాయంట్. మొదటి మూడు రోజులలోనే పెట్టుబడిలో డెబ్భై శాతం రికవర్ అయిపోయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ మొత్తం 18కోట్లుగా అంచనా. బాక్సాఫీసు షేరే దాదాపుగా 15 కోట్లు ప్లస్ అని పరిశ్రమంతా మెచ్చుకుంటోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం తెర వెనక జరిగిన విశేషాలు బయిటకు వస్తున్నాయి. ఈ మళయాళి రీమేక్ ను మొదట రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ డైరక్ట్ చేద్దామనుకున్నారు.అయితే రకరకాల కారణాలతో వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ ఆఫర్ కళ్యాణ్ కృష్ణ దగ్గరకు వెళ్లిందని సమాచారం. గతంలో తనతో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు చేసి ఉండటం అవీ సంక్రాంతి హిట్స్ కావటంతో ఈ సినిమాని కళ్యాణ్ కృష్ణ అయితే బాగా డీల్ చేస్తారు ,బజ్ కూడా బాగుంటుందని భావించారు. ఆ క్రమంలో నాలుగైదు మీటింగ్ లు అయ్యిన తర్వాత కళ్యాణ్ కృష్ణ నో చెప్పారని వినికిడి. అప్పటికే చిరంజీవి ప్రాజెక్టు బిజీలో ఉన్న ఆయన ఇప్పుడు ఈ రీమేక్ ని డైరక్ట్ చేయటానికి ఆసక్తి చూపలేదని సమాచారం. దాంతో నాగార్జున ..విజయ్ బిన్నీని డైరక్టర్ ని చేసారని తెలుస్తోంది.
అక్కినేని నాగార్జునకు కొద్ది కాలంగా సక్సెస్ అనేది లేదు. అయితే సంక్రాంతికి ఆయన సినిమా హిట్ కొడతాను అనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన నా సామి రంగ ప్రోమోలు చూస్తే పక్కా పండగ సినిమాలా కనిపించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ.. నాగ్ కోరుకున్న విజయాన్ని అందించిందనే చెప్పాలి. . ఒక విలేజ్ డ్రామాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉండటమే కలిసొచ్చింది. కొత్త కథ.. గొప్ప మలుపులు.. వావ్ అనిపించే అంశాలు లేకపోయినా రెండున్నర గంటలు టైం పాస్ చేయడానికి అయితే ఇందులో ఢోకా లేదు. సంక్రాంతి అయ్యిపోయినా ...ఆంధ్రాలో డ్రాప్ లేదు. డీసెంట్ కలెక్షన్స్ నడుస్తున్నాయి. అయితే నైజాం లో మాత్రం పూర్తి డ్రాప్ కనపడుతోంది.
నా సామిరంగా..వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉నైజాం : 5Cr
👉సీడెడ్ : 2.2Cr
👉ఆంధ్రా: 8Cr
ఆంద్రా- తెలంగాణా టోటల్ :- 15.30CR
👉ఓవర్ సీస్ – 2Cr
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : 18.20CR(BREAK EVEN – 19CR+)
నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న చేసిన సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించగా, ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయని వినికిడి. ఇది తెలుగు సినిమా వరకూ రికార్డ్ ప్రైస్ అనే చెప్పాలి. డిస్నీ హాట్ స్టార్ Disney Hotstar వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. నాగార్జున సినిమాలు ఓటిటి లో బాగా వెళ్లటం, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో ఈ రేటు వచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా రీమేక్ చిత్రాలకు ఈ రేటు పలకదు. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన పోరంజు మరియం జోస్ ‘Porinju Mariam Jose’కు ఈ చిత్రం రీమేక్ .