`మెగా` అల్లుడు సినిమా డైరక్ట్ ఓటీటీలోకి ?
గతేడాది చిత్ర నిర్మాతలు సినిమాల విడుదల కోసం ఓటీటీ బాట పట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే.. కొన్ని సినిమాలు ఓటీటీ సంస్థలతో ఎగ్రిమెంట్స్ పూర్తి చేసేసుకున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా బాగా ఎఫెక్ట్ అయిన ఫీల్డ్ లలో సినిమా రంగం కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా కోట్ల బిజినెస్ జరిగే ఫిల్మ్ ఇండస్ట్రీ కంటికి కనిపించని వైరస్ కారణంగా చతికిల పడింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడం, షూటింగ్ ఆగిపోవడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి అనుకునేలోగా మళ్లీ గతేడాది పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగ్‌లు చాలా వరకూ ఆగిపోతున్నాయి. ఆర్టిస్ట్ లు కరోనా బారిన పడుతుండడంతో కొన్నిసినిమాలు షూటింగ్ వాయిదా వేసుకున్నాయి. ఇక కొన్నిరాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో సినిమాల విడుదలలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గతేడాది చిత్ర నిర్మాతలు సినిమాల విడుదల కోసం ఓటీటీ బాట పట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే.. కొన్ని సినిమాలు ఓటీటీ సంస్థలతో ఎగ్రిమెంట్స్ పూర్తి చేసేసుకున్నాయి.
అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్` సినిమా ఆహాలో విడుదల కానుంది. మే 7 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా ఆహాలోకి వెళ్లిపోయిందని సమాచారం. అదే సూపర్ మచ్చీ. మెగా అల్లుడు... కల్యాణ్ దేవ్ నటించిన సినిమా ఇది. పులి వాసు దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తయ్యింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అందుకే ఇప్పుడు ఓటీటీకి ఇచ్చేశారని సమాచారం. మేలోనే.. ఈసినిమా ఆహాలో ప్రదర్శితం అవుతుందని చెప్తున్నారు.
‘సూపర్ మచ్చి’లో బయటకు రఫ్‌గా ఉంటూ లోపల సెన్సిటివ్‌గా ఉండి ఓ చిన్న బార్‌లో పని చేసే మాస్ సింగర్ పాత్రలో కళ్యాణ్ దేవ్ నటిస్తున్నాడు. రచితా రామ్, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది.