మెగాస్టార్ చిరంజీవి అల్లుడి హోదాలో సినీ రంగప్రవేశం చేసారు కళ్యాణ్ దేవ్. ఆయన  మొదటి చిత్రం 'విజేత' ఆడకపోయినా..నటనకు మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నాడు. దాంతో  ఆయన తన రెండవ సినిమాపై దృష్టి పెట్టాడు.  నూతన దర్శకుడు పులి వాసు డైరెక్షన్ లో సినిమా మొదలైంది.  రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ సినిమా అప్ డేట్స్ రాలేదు. కానీ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ పూర్తయ్యాక  హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా పేరు పెట్టిన ఈ చిత్రంలో షూటింగ్ చేసిన సీన్స్ చూసి, స్టోరీ ఇంకాస్త ఇంప్రవైజ్ చేసి షూట్ చేస్తే బెస్ట్ అని ఫీలయ్యారట. దాంతో సినిమాని హోల్డ్ లో పెట్టి హీరోకు శెలవులు ఇచ్చి టీమ్ ..కథా చర్చల్లో మునిగిపోయినట్లు చెప్తున్నారు. కథ సంతృప్తిగా వచ్చాక రెగ్యులర్ షూటింగ్ జరుపుతారని చెప్తున్నారు. 

రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ  విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్ దేవ్ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే క‌సితో ఉన్నాడు మెగా అల్లుడు.