మెగాస్టార్ రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ ని 'విజేత' సినిమాతో హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా.. నటుడిగా ఓ మోస్తరు మార్కులు సంపాదించుకున్నాడు కళ్యాణ్ దేవ్. 

ఇప్పుడు అతడిని హీరోగా పెట్టి మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పులివాసు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నరేష్, పోసాని కృష్ణమురలి వంటి సీనియర్ నటులు కనిపించనున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదని త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.