ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా నేడు  వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం రాజశేఖర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా కాస్త బజ్ ని క్రియేట్ చేసింది. అయితే సినిమా యూఎస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్స్ ను కొంతమంది తెలుగు ఆడియెన్స్ వీక్షించారు. 

సినిమా టాక్ విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1980ల కాలంలో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. కల్కి సినిమాతో దర్శకుడు ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో వచ్చే ట్విస్ట్ అసలైన హైలెట్ పాయింట్. 

అక్కడక్కడా యాక్షన్ సీన్స్ - సాంగ్స్ ఇరికించినట్లు అనిపించినప్పటికీ వెంటనే సప్సెన్స్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ మూడ్ ని మార్చేస్తుంది. రాజశేఖర్ నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అయితే రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పకపోవడం కాస్త వాయిస్ ని మిస్ అవుతున్నామన్న భావన కలుగుతుంది.  

అంకుశం రేంజ్ లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అ! సినిమా తరహాలోనే ప్రశాంత్ వర్మ చేసిన కొన్ని డిఫరెంట్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మొత్తానికి పరవాలేదు అనే విధంగా టాక్ తెచ్చుకున్న కల్కి ఇండియన్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.