రాజశేఖర్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్ర కల్కి. గరుడవేగ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీ స్టార్ ఇప్పుడు కల్కితపో తన విశ్వరూపాన్ని చూపించాలని రెడీ అవుతున్నాడు. అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాను జులై 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పరకటించింది. శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పాట మినహా సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తీ చేసినట్లు తెలుస్తోంది. 

కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను చిత్రీకరించినట్టు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. త్వరలో పాటలను రిలీజ్ చేసి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు వివరణ ఇచ్చారు.