ఈ రెండు సినిమాలు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాల ఓవర్ సీస్ రైట్స్ తలో ...

ఓవర్ సీస్ మార్కెట్ లో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలదే హవా. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అక్కడ తెలుగు సినిమాలకు భారీ క్రేజ్, మార్కెట్ క్రియేట్ అయింది. బాహుబలి 2, RRR, పుష్ప సినిమాలు టాలీవుడ్ స్థాయిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. అదే సమయంలో సినిమాల రైట్స్ కోసం చెప్పే రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు పుష్ప 2, కల్కి సినిమాల ఓవర్ సీస్ రైట్స్ చెప్తున్న రేటు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలకు ఓవర్ సీస్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదని వినికిడి. ఆ రేట్లుకు తీసుకుంటే ఏ మేరకు రికవరీ అవుతుందనే ఆలోచనలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారట. వివరాల్లోకి వెళితే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీనిని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

 మరోవైపు మహానటి వంటి సూపర్ హిట్ చిత్రంతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిన నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ రెండు మూవీస్ పై దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

 ఈ రెండు సినిమాలు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాల ఓవర్ సీస్ రైట్స్ తలో 100 కోట్లు చెప్తున్నారని తెలుస్తోంది. అయితే నెగోషియేషన్స్ ఉంటాయి. కానీ ఓవర్ సీస్ లో వంద కోట్ల మార్కెట్ అంటే అనగానే రికవరీ ఎలా ఉంటుంది బ్రేక్ ఈవెన్ ఎలా అని ఆలోచనలో పడుతున్నారట. మొత్తంగా పుష్ప 2 తో పాటు కల్కి మేకర్స్ కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. మరి ఈ రెండు క్రేజీ మూవీస్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాయో చూడాలి.