Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలోకి కల్కి 2898 AD.. అఫీషియల్ డేట్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసింది. ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాహుబలి తర్వాత పూర్తి స్థాయిలో ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాని తెలియజేసిన చిత్రం కల్కి.

Kalki 2898 AD movie ott release date fixed officially dtr
Author
First Published Aug 18, 2024, 12:32 PM IST | Last Updated Aug 18, 2024, 12:32 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసింది. ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాహుబలి తర్వాత పూర్తి స్థాయిలో ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాని తెలియజేసిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అబ్బురపరిచింది. 

కల్కి చిత్రాన్ని మరోసారి ఓటిటిలో చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. అంతలా నాగ్ అశ్విన్ మంచి కిక్ ఇచ్చాడు. కల్కి ఓటిటి రిలీజ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. 

ఆగష్టు 22 నుంచి కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళ తో పాటు మిగిలినసౌత్ ఇండియన్ భాషల్లో అమెజాన్ ప్రైజ్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది. 

 

దీనితో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహాభారత సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ నెమ్మదిగా ఫస్ట్ హాఫ్ ని నడిపించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో సినిమా గేర్ మారుతుంది. క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించే విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios