Asianet News TeluguAsianet News Telugu

`కల్కి 2898 ఏడీ` ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. `భైరవ ఆంథెమ్‌`‌ వచ్చేది అప్పుడే.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి ట్రీట్‌

`కల్కి 2898 ఏడీ` సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ వస్తుంది. తాజాగా ప్రోమో విడుదల చేశారు. `భైరవ ఆంథెమ్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. 
 

kalki 2898 ad movie first single bhairava anthem promo out full song from tomorrow arj
Author
First Published Jun 15, 2024, 5:18 PM IST

`కల్కి 2898ఏడీ` సినిమా మరో 12 రోజుల్లో రిలీజ్‌ కాబోతుంది. ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు టీమ్‌. ఇప్పటికే ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఇక ఇప్పుడు సాంగ్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. `భైరవ ఆంథెమ్‌ని మొదటి పాటగా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సాంగ్‌ ప్రోమో వచ్చింది. పాపులర్‌ సింగర్‌ దిల్జిత్‌ దోసాంజే ఆలపించిన ఈ పాటలో ప్రభాస్‌ కనిపిస్తుండటం విశేషం. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆ విషయాన్ని చూపించారు. 

దిల్జిత్‌ దోసాంజే తనదైన యాప్ట్ గెటప్‌లో కనిపించారు. నల్ల కోట్‌, సిక్క్‌ పాగా ధరించారు. మరోవైపు ప్రభాస్‌ యోధుడిని తలపించే కాస్ట్యూమ్స్ తో ఉన్నాడు. ఇద్దరు వచ్చి హ్యాండ్‌ ఇచ్చుకోవడం అదిరిపోయింది. ఈ ఇద్దరిపై ఈ సాంగ్‌ చిత్రీకరించినట్టు తెలుస్తుంది. సినిమాకి ఊపు తెచ్చేలా ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇందులో ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర తీరుతెన్నులను, హీరోయిజాన్ని, మ్యానరిజాన్ని తెలియజేసేలా ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. 

ఇక సాంగ్‌ ప్రోమో లిరిక్‌ హిందీలో ఉంది. ఈ పూర్తి పాటని రేపు(ఆదివారం) విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్‌ పూర్తిగా కనిపిస్తాడు. ఆయన డాన్సులతో అలరించబోతున్నారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ పాట ఉంటుందని చెప్పొచ్చు. దీనికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని ఈనెల 27న విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో గ్లోబల్‌ ఫిల్మ్ రేంజ్‌లో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్‌, ట్రైలర్‌ వచ్చాయి. ఏది వచ్చినా సినిమాపై హైప్‌ పెంచలేకపోయాయి. అన్నింటిలోనూ ఏదో డిజప్పాయింట్‌ మెంట్‌ కనిపిస్తుంది. ఫ్యాన్స్ హ్యాపీగా లేదు. ట్రైలర్‌లో కొన్ని షాట్స్ ఓకే అనిపించాయి. విజువల్స్ గా బాగుంది. కానీ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ని జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారనేది ప్రశ్న. గతాన్ని, భవిష్యత్‌ని ఎలా లింక్‌ చేస్తాడనే ఉత్సుకత ఉంది.

కానీ రెగ్యూలర్‌ మాస్‌ మసాలా అంశాలు లేకపోవడంతో ఫ్యాన్స్ కి ఎక్కడం లేదు. మరి సినిమా అయినా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. సుమారు ఏడువందల కోటతో అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చాలా మంది కాస్టింగ్‌ గెస్ట్ గా మెరవబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios