హోరెత్తిపోతున్న `కల్కి2898ఏడీ` బీజీఎం.. ప్రపంచం ఊగిపోవాల్సిందే..
ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ స్కేల్‌లో రూపొందుతున్న మూవీ `కల్కి`. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విడుదల కానీ బీజీఎంని ప్రదర్శించాడు సంతోష్ నారాయణ్. అది ఊపేస్తుంది.
ప్రభాస్ మరో భారీ సినిమాతో రాబోతున్నారు. ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `కల్కి2898ఏడీ` మూవీలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ సమ్మర్‌లో రచ్చే చేసేందుకు వస్తుంది. సినిమాని కనీవినీ ఎరుగనీ రీతిలో రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా మ్యూజిక్ హైప్ పంచేసింది. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఆయన `నీయిఓలీ` మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇందులో `కల్కి` మూవీ మ్యూజిక్ బీజీఎంని ప్రదర్శించారు. ఈ సినిమా గ్లింప్స్ కి సంబంధించిన మ్యూజిక్‌ని ఆయన ఈవెంట్‌లో ప్రదర్శించారు. సినిమా విజువల్స్ వాడి కల్కి సినిమాలోని రెండు నిమిషాల మ్యూజిక్ ఆడియోని ప్రదర్శించారు. ఆ మ్యూజిక్ ఇక ఈవెంట్ మొత్తం హోరెత్తిపోయింది. ఊగిపోయారు. ఓరకంగా ఇది గూస్ బంమ్స్ తెప్పించేలా ఉంది. కేవలం ఆడియోని ఈ రేంజ్‌లో ఉంటే, ఇక విజువల్స్ తో కూడిన బీజీఎం వింటే సినీ ప్రపంచమే ఊగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా ఈ మ్యూజిక్ సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేసింది. వరల్డ్ క్లాస్ మ్యూజిక్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ బీజీఎం అంటూ కామెంట్లు పెడుతున్నారు. `కల్కి`లో ఈ రేంజ్ మ్యూజిక్ ఉంటే సినిమా నెక్ట్స్ లెవల్ లెవల్‌కి వెళ్తుందని అంటున్నారు. మొత్తంగా సంతోష్ నారాయణ్ చేసిన ఈ మ్యాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది.
ఇక ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, రానా ప్రధాన పాత్రల్లో, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. మే 9న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. వాయిదా పడుతుందనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.