టాలీవుడ్ బ్రదర్స్ కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో గాని గెస్ట్ రోల్స్ లాంటివి అయితే కుదురుతాయని అప్పట్లో నందమూరి బ్రదర్స్ మాట్లాడుకున్నట్లు టాక్ గట్టిగా వచ్చింది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ తారక్ తో కళ్యాణ్ రామ్ మరో సినిమాను నిర్మిస్తాడట. ఇక రీసెంట్ గా 118కథను విన్న కళ్యాణ్ రామ్ మొదట తన ఉహల్లోకి కథానాయకుడిగా తారక్ కనిపించినట్లు చెప్పాడు. ఈ సినిమా తమ్ముడు చేస్తే బావుంటుందని అనుకున్నా కానీ నిర్మాత మహేష్ కోనేరు వచ్చి.. ఈ సినిమా మీతో తియ్యాలని అనుకుంటున్నాం అనగానే కాదనలేకపోయా అని తెలిపారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీలైనంత త్వరగా తారక్ తో మరో సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ తెలిపారు. అయితే వీరి కలయికలో ఇప్పట్లో అయితే సినిమా ఉండకపోవచ్చు. ప్రస్తుతం జక్కన్న RRR తో బిజీగా ఉన్న తారక్ ఆ తరువాత మైత్రి మూవీ ప్రొడక్షన్ లో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.