కాజోల్‌కి కరోనా సోకింది. తనకి కోవిడ్ 19 పాజిటివ్‌గా వచ్చిందని తెలిపింది. ఈమేరకు ఆమె ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ హీరోయిన్, అజయ్‌దేవగన్ భార్య కాజోల్(Kajol) సైతం కరోనా బారిన పడ్డారు. ఆమె తనకు కోవిడ్ 19(Kajol Covid 19 Positive) పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆదివారం(జనవరి 30)న వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది కాజోల్. అయితే ఈ సందర్భంగా ఆమె తన కూతురు ఫోటోని షేర్ చేయడం విశేషం. కోవిడ్ కారణంగా ముక్కు ఎరుపెక్కిందని, ముక్కు కారుతున్న నేపథ్యంలో అలా తన ఫేస్‌ని చూపించలేనని చెప్పినకాజోల్ తన కూతురు నైసా పిక్‌ని షేర్ చేసుకుంది.
`నాకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నేను నిజంగా నా రన్నీ నోస్‌ని చూపించాలనుకోవడం లేదు. అందుకే మనం ప్రపంచంలోని అద్బుతమైన చిరునవ్వుని కలిగి ఉందాం. నైసా దేవగన్ నిన్ను చాలా మిస్ అవుతున్నా. కానీ నిన్ను చూడగలను` అని పేర్కొంది కాజోల్. కాజోల్ పంచుకున్న ఫోటోలో నైసా ట్రెడిషనల్ లుక్‌లో, మెహందీ పెట్టుకుని ఏదో వేడుకలో పాల్గొన్నట్టుగా ఉంది. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఆ పిక్ కట్టిపడేస్తుంది. నైసా.. Kajol, అజయ్ దేవగన్‌ల ముద్దుల తనయ అనే విషయం తెలిసిందే.
ఇక కాజోల్ పోస్ట్ కి చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. త్వరగా మహమ్మారి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు. వారిలో ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఆమె స్టన్నింగ్ అంటూ పోస్ట్ చేసింది ప్రియాంక. ఆమెతోపాటు చాలా మంది సెలబ్రిటీలుస్పందించారు. ఇక కాజోల్ చివరగా `త్రిభంగా` అనే నెట్‌ఫ్లిక్స్ లో నటించింది. ఆమెకిది ఓటీటీ ఎంట్రీ కావడం విశేషం. రేణుకా సాహనే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కాజోల్ రేవతి దర్శకత్వం వహిస్తున్న `ది లాస్ట్ హర్రే` చిత్రంలో నటిస్తుంది.
