`ఆర్‌ఆర్‌ఆర్‌` నటుడు అజయ్‌ దేవగన్‌ భార్య, స్టార్‌ హీరోయిన్‌ కాజోల్‌.. రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు మీడియాలో ఆమె పెద్ద చర్చనీయాంశంగా మారింది. కారణం ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోస్‌లో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆమె చేసిన కామెంట్స్ ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

 ప్రస్తుతం ఆమె కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తున్నాయి. మరి కాజోల్‌ ఇంతకి ఏమని కామెంట్‌ చేసింది, ఆమె ఎందుకు వైరల్‌ అవుతుందనేది చూస్తే,

`దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే` చిత్రంతో స్టార్‌ అయిన కాజోల్‌

కాజోల్‌ ఒకప్పుడు బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్‌. `దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే`తో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓ థియేటర్ లో ఇది ఏకంగా 12ఏళ్లపాటు ప్రదర్శించబడింది. 

ఇదే కాదు, కాజోల్‌ బాలీవుడ్‌లో అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో ఆకట్టుకుంది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆ మధ్య సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వీఐపీ 2`లో కూడా నటించింది. ఇందులో నెగటివ్ రోల్‌ చేసింది. 

అలాగే కాజోల్‌ నటిగా ఆకట్టుకోవడంతోపాటు, గ్లామర్ పరంగానూ మెప్పించింది. మోస్ట్ గ్లామరస్‌ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంది కాజోల్‌. ఇక నటన పరంగా ది బెస్ట్ అనిపించింది. ఆమె హవాభావాలు, స్పాంటినిటీ, చాలాకీతనం వంటి వాటి విషయంలోనూ ప్రశంసలు పొందింది కాజోల్‌.

`మా` మైథలాజికల్‌ మూవీతో రాబోతున్న కాజోల్‌

ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది. పెళ్లై, పిల్లలున్నారు, దీంతో కేవలం బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలకే మొగ్గు చూపుతుంది. అదే సమయంలో తన పాత్రకు ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తోంది. సినిమాల్లో తన పాత్ర ఇంపాక్ట్ ఉంటేనే ఒప్పుకుంటుంది.

 ఈ క్రమంలో తాజాగా కాజోల్‌ `మా` అనే మూవీలో నటించింది. ఆమె మెయిన్‌ లీడ్‌గా ఈ మూవీ రూపొందింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీనికి విశాల్‌ ఫురియా దర్శకత్వం వహించారు. మైథలాజికల్‌ హర్రర్‌ మూవీగా ఇది రూపొందింది. 

ఇందులో కాజోల్‌తోపాటు రోనిత్‌ రాయ్‌, ఇంద్రనీల్‌సేన్‌ గుప్తా, ఖేరిన్‌ శర్మ, జితిన్‌ గులాటి, గోపాల్‌ సింగ్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కాజోల్‌ కూడా ఓ దెయ్యంలా కనిపిస్తుందని తెలుస్తోంది. కాజోల్‌ భర్త అజయ్‌ దేవగన్‌తోపాటు జ్యోతి దేశ్‌ పాండే, కుమార్‌ మంగట్ పథక్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

`మా` చిత్ర ప్రమోషన్స్ లో కాజోల్‌ సంచలన వ్యాఖ్యలు

కాజోల్‌ నటించిన `మా` మూవీ ఈ నెల 27న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉంది కాజోల్‌. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

హైదరాబాద్‌ శివారులో ఉండే రామోజీ ఫిల్మ్ సిటీపై ఆమె షాకింగ్‌ కామెంట్స్ చేసింది. `గాలాటా ఇండియా` అనే ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలకు, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి వేదికగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీపై ఆమె ఊహించని వ్యాఖ్యలు చేసింది. ఇది దెయ్యాల కోటగా వర్ణించింది.

ఆర్‌ఎఫ్‌సీలో భయానక శబ్దాలు వచ్చేవంటూ కాజోల్‌ కామెంట్స్

కాజోల్‌ నటించిన నటించిన `మా` సినిమా హర్రర్‌ ఎలిమెంట్లతో సాగుతుంది. భయానకంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాను కూడా రియల్‌ లైఫ్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. యాంకర్‌ అడిగిన ప్రశ్నకి ఆమె వివరిస్తూ, ఎగ్జాంపుల్‌గా రామోజీఫిల్మ్ సిటీని ప్రస్తావించింది. గతంలో తాను ఇక్కడ షూటింగ్‌ల్లో పాల్గొన్నదట. 

ఆ సమయంలో ఆర్‌ఎఫ్‌సీలో చాలా భయానకమైన శబ్దాలు వచ్చేవని తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటి అని వర్ణించింది. రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్‌ జరిగినప్పుడు చాలా వరకు అసౌకర్యవంతంగా ఫీలయ్యేదాన్ని అని, ఆ ప్రదేశం దెయ్యాల ప్రకంపనలు కలిగి ఉందని కాజోల్‌ వ్యాఖ్యానించింది.

రామోజీ ఫిల్మ్ సిటీకి ఎప్పటికీ రాకూడదనుకున్న కాజోల్‌

అక్కడ కొన్ని ప్రదేశాలు చాలా భయానకంగా అనిపించాయని, వెంటనే వెళ్లిపోవాలని, తిరిగి రాకూడదని అనిపించిందని రామోజీ ఫిల్మ్ సిటీలో తనకు ఎదురైన అనుభవాన్ని కాజోల్‌ వెల్లడించింది. మళ్లీ ఇంకా ఎప్పుడూ ఆర్‌ఎఫ్‌సీకి రాకూడదని అప్పుడు అనుకున్నట్టు తెలిపింది కాజోల్‌.

 ఇప్పుడు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు నాట సంచలనంగా మారాయి. అయితే దీనికి సంబంధించిన నిరూపించే అంశాలను ఇందులో ఆమె ప్రస్తావించలేదు, కానీ జనరల్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో ఇది కాస్త వివాదంగానూ మారుతుంది.

 జనరలైజ్‌ చేసి ఎలా ఆరోపణలు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాజోల్‌ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచంలోనే, దేశంలోనే గొప్ప స్టూడియోగా పేరుతెచ్చుకున్న ఆర్‌ఎఫ్‌సీపై నింద వేయడమే అని నెటిజన్లు అంటున్నారు.

 మొత్తంగా కాజోల్‌ కామెంట్స్ పెద్ద రచ్చ అవుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇది మున్ముందు ఎటు వెళ్తుందో చూడాలి. కానీ కాజోల్‌ చేసింది మామూలు కామెంట్స్ కాదు, వీటి ప్రభావం చాలా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆర్‌ఎఫ్‌సీ బహుభాషా చిత్రాల షూటింగ్‌లకు కేరాఫ్‌..

రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రముఖ్య వ్యాపారవేత్త, పత్రికా అధినేత రామోజీరావు ప్రారంభించారు. ఈ స్టూడియోని 1996లో ప్రారంభించారు. సుమారు ఇది రెండు వేల ఎకరాల్లో నిర్మించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా ప్రసిద్ధి చెందిన ఈ ఫిల్మ్ సిటీలో థీమ్‌ పార్క్ హైలైట్‌గా నిలుస్తుంది.

 పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఎన్నో నిర్మాణాలుంటాయి. ఇది టూరిస్ట్ ఏరియాగానూ, అదే సమయంలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనువుగానూ ఉంటుంది. తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలు కూడా ఇందులో చిత్రీకరణ జరుపుకుంటాయి. బాహుభాషా చిత్రాల నిర్మాణం ఇందులో జరుగుతుంటుంది. 

వీటితోపాటు హోటల్స్ కూడా ఉంటాయి. సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు కూడా వీటిలోనే ప్లాన్‌ చేస్తుంటారు. `బాహుబలి`, `రాధేశ్యామ్‌`, `కల్కి` వంటి చిత్రాల ఈవెంట్లని ఇందులోనే నిర్వహించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.

 ఇక ప్రస్తుతం కాజోల్‌.. రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.

`ఆర్‌ఆర్‌ఆర్‌` నటుడు అజయ్‌ దేవగన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజోల్‌

ఇక కాజల్‌ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కలిసి పలు సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు నైసా, కుమారుడు యుగ్‌ ఉన్నారు. 

అజయ్‌ దేవగన్‌ తెలుగు ఆడియెన్స్ కి పరిచయమే. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో చిన్నప్పటి రామ్‌ చరణ్‌కి తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన గూడెం యువకుల్లో దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని రగిల్చే పాత్రలో ఆయన కనిపించారు. కాసేపు మెరిసి అదరగొట్టారు.