2020లో ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. లక్షల మంది ప్రాణాలు బలిగొనడంతో పాటు, మనిషి బయట తిరగకుండా చేసింది. నెలల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ భయాందోనళకు గురిచేసింది. మనిషి నుండి మనిషికి సులభంగా వ్యాపించే కరోనా వైరస్ కారణంగా, విందులు, వినోదాలు, ఈవెంట్స్, పార్టీలు కనుమరుగై పోయాయి. 
 
ఇదే విషయాన్ని తలచుకుంటూ హీరోయిన్ కాజోల్ బాధపడ్డారు. తన వేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వేల మంది ప్రేక్షకుల మధ్య తాను లైవ్ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్న ఫోటో పోస్ట్ చేసి, ఆ రోజులు మిస్సవుతున్నాని కామెంట్ చేశారు. పదుల సంఖ్యలో డాన్సర్స్ ఉండగా, మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య కాజోల్ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. 
 
ఇలాంటి స్టేజ్ పెర్ఫార్మన్స్ లు, వేల కొలది ఆడియన్స్ సమూహంలో ప్రదర్శనలు కోవిడ్ తరువాత బంద్ అయిన సంగతి తెలిసిందే.స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ని వివాహం చేసుకున్న కాజోల్, ఇప్పటికీ వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన భారీ పీరియాడిక్ మూవీ తన్హాజి లో కాజోల్ ఓ కీలక రోల్ చేశారు. అలాగే ఆమె నటించిన త్రిభంగ ఓ టి టి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)