ఇటీవల కాజల్ మ్యారేజ్ చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని బిజీ అయిపోయింది. సొంత వ్యాపారాలు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకునే పనిలో బిజీ అయ్యింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికే హ్యాండిచ్చింది. ముందు నటించేందుకు ఓకే చెప్పి, ఆ తర్వాత హ్యాండిచ్చింది. దీంతో షాక్ తినడం దర్శకుడు తేజ వంతయ్యింది. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, దర్శకుడు తేజ ప్రస్తుతం `అలివేలు వెంకటరమణ` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లేడీ ప్రధానంగా ఈ సినిమా సాగనుంది. ఇందులో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఇటీవల కాజల్ మ్యారేజ్ చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని బిజీ అయిపోయింది. సొంత వ్యాపారాలు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకునే పనిలో బిజీ అయ్యింది. ఇప్పటికే `ఆచార్య` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. మరోవైపు తమిళంలో నటిస్తున్న `హే సినామిక` చిత్ర షూట్ ని పూర్తి చేసుకుంది.
మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని కొత్త కమిట్‌మెంట్లకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలనుకుంటుందట. అందుకే తేజ సినిమాకి నో చెప్పిందట. ఇప్పట్లో తాను నటించలేని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కాజల్ స్థానంలో తాప్సీని తీసుకున్నారట తేజ. ఇదిలా ఉంటే కాజల్.. తేజ రూపొందించిన `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో `నేనే రాజు నేనే మంత్రి`, `సీత` చిత్రాల్లో నటించింది. 2018లో వచ్చిన `సీత` పరాజయం చెందింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 6, 2021, 11:56 AM IST