హీరోయిన్ గా తన చక్కటి  నటనతో ఆకట్టుకున్న కాజల్ మొదటిసారి విలన్ గా మారారట. ఆమె ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇందులో హీరోగా కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో కాజల్‌  నెగిటివ్ షేడ్స్  ఉన్న ‘సీత’ అనే పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం ఆమె చాలా కసరత్తులు చేసినట్లు సమాచారం. 

గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాలో ఆమని పాత్రను యాజటీజ్ మళ్లీ కొద్దిగా మార్చి చేస్తోంది. డబ్బు కోసం ఎంతకైనా , ఎంతదూరం అయినా వెళ్లిపోయే పాత్ర అది. ఆ పాత్రని కాజల్ కొత్త డైమన్షన్ లో కనిపించనుందని సమాచారం. 

ఇక ఆమె నటన విషయంలో దర్శక, నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మహిళా (నటి) ప్రాధాన్యం ఉన్న చిత్రంగా తెరకెక్కుతోన్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ హీరోయిన్ గా అలరించిన కాజల్‌ ఇలాంటి పాత్రలో నటిస్తూ.. సాహసం చేస్తున్నారని ఇండస్ట్రీ అంటోంది. 

కాజల్‌ నటించిన ‘కవచం’ సినిమా ఇటీవల విడుదలైంది. ఆమెతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్‌, మెహరీన్‌ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరోపక్క కాజల్‌ నటించిన ‘క్వీన్‌’ రీమేక్‌ ‘ప్యారిస్ ప్యారిస్’‌ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. కమల్‌హాసన్‌ హీరోయిన్ గా తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’ సినిమాలోనూ కాజల్‌ నటించనున్నారు.