టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ కొన్నాళ్లుగా ఆటో ఇమ్యూన్ డిజార్దర్ అనే జబ్బుతో బాధపడినట్లు చెప్పింది. ఇప్పటివరకు కాజల్ కి సంబంధించి ఇలాంటి రూమర్స్ కూడా వినిపించలేదు. కానీ తనకున్న అనారోగ్య సమస్యల గురించి కాజల్ స్వయంగా వెల్లడించింది.

''ఈ ఏడాది ఆరంభంలో బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. మూడు నెలల పాటు నా ఆరోగ్యం అసలు బాలేదు. పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ టైమ్ లో ముంబైలో ఉన్నాను. సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నాను. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకోలేకపోయాను.

ఆటో ఇమ్యూన్ డిజార్దర్ తో బాధపడ్డాను. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. కానీ నేను కాస్త స్పీడ్ తగ్గించాలి. బ్రేక్ తీసుకోవాలనే దేవు ఇలా చేశాడేమో అనిపించింది. సినిమాలు తగ్గించాల్సిందే.ఈ జబ్బు ఉందనే విషయం నాకు తెలియదు.

రోజూ సినిమా షూటింగ్స్ కి వెళ్లేదాన్ని. రోజూ జ్వరం వచ్చేది. తొందరగా అలసిపోయేదాన్ని. అలా ఎందుకు వచ్చేదో, ఆ బాధ ఎలా ఉండేదో మాటల్లో చెప్పలేను. డాక్టర్స్ పర్యవేక్షణలో అధిక మోతాదులో మందులు తీసుకున్నాను'' అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది.