మాజీ సీఎం పాత్రలో చందమామ.?

First Published 10, Apr 2018, 5:41 PM IST
Kajal playing jaya lalitha role in NTR Biopic
Highlights
మాజీ సీఎం పాత్రలో చందమామ.?

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కథానాయకుడిగా ఎన్టీఆర్ తో ముడిపడిన పాత్రల కోసం .. రాజకీయాల పరంగా ముడిపడిన పాత్రల కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. దీంతో ఆమెకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో వుంటాయట. అందువలన ఆమె పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిడివి తక్కువే అయినా ప్రతిష్ఠాత్మక చిత్రం కావడం వలన .. విశిష్టమైన పాత్ర కావడం వలన కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువని చెప్పుకుంటున్నారు.

loader