టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకొని సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు వరుసగా అవకాశాలను అందుకుంటూ నేటితరం కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ లో దాదాపు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 

ఇకపోతే రీసెంట్ గా అమ్మడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారతీయుడు 2 సినిమాకు సెలెక్ట్ అయిన  సంగతి తెలిసిందే. అయితే కెరీర్ లో ఇప్పటివరకు కాజల్ ఎప్పుడు కనిపించని విధంగా ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ లో కనిపించనుందని సమాచారం. ఓ విధంగా ఆ క్యారెక్టర్ తో షాక్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు శంకర్ కాజల్ పాత్రను డిఫరెంట్ గా సెట్ చేసుకున్నట్లు సమాచారం. 

హాలీవుడ్ నుంచి మేకప్ నిపుణులతో కాజల్ పాత్రను రెడీ చేస్తున్నారట. విదేశాల్లోనే ఫొటో షూట్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ అఫర్ తో కాజల్ సంబరపడి పోతోంది. అయితే ఆమె పాత్రను శంకర్ ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక కాజల్ రీసెంట్ గా నటించిన కవచం సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమాను శ్రీనివాస్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు.