యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది...అనుష్కపై ఒత్తిడి పెంచేసిన కాజల్


వెంకీ పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే కాబోలు. కాజల్ పెళ్లి అనుష్కకు తలనొప్పులు తెచ్చిపెడుతుందట. అనుష్క పెళ్లి చుకోవాలని ఆమె పేరెంట్స్ బాగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం అందుతుంది. 

kajal marriage building pressure on anushka shetty ksr

పరిశ్రమలో దాదాపు ఒకే సమయంలో అడుగుపెట్టారు కాజల్, అనుష్క. 2005లో వచ్చిన సూపర్ మూవీతో అనుష్క శెట్టి వెండితెరకు పరిచయం కాగా, తేజ దర్శకత్వంలో 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. స్టార్ హీరోయిన్స్ గా ఇద్దరూ తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ కాజల్, అనుష్క ఫేడ్ అవుట్ దశలో ఉన్నట్లే లెక్క. 

ఈ విషయం గ్రహించిన 35 ఏళ్ల కాజల్ పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును గత నెల 30న కాజల్ వివాహం చేసుకున్నారు. వరుస చిత్రాలు చేస్తూనే కాజల్, మరీ ముదిరిపోవడం మంచిది కాదని త్వరపడి పెళ్లి చేసుకుంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనగా, కాజల్ కూడా వైవాహిక జీవితంలోకి ఎంటరైపోయింది. 

మరి కాజల్ తో పోల్చుకుంటే అనుష్క మూడేళ్ళ పెద్దది. ప్రస్తుతం అనుష్క 38ఏళ్ళు పూర్తి చేసుకొని 40వైపు అడుగులేస్తోంది. కాజల్ వలె బిజీగా సినిమాలు కూడా అనుష్క చేయడం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు. మరో వైపు 40ప్లస్ లో ఉన్న ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోకపోవడంతో వీరిద్దరూ ఎదో ఒకరోజు బాంబు పేల్చుతారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి అనుష్క నచ్చినవాడు దొరకాలికదా అంటుంది. కానీ పెళ్లి విషయంలో పేరెంట్స్ మాత్రం అనుష్కను ఒత్తిడి చేస్తున్నారట. నీ తోటి హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటుండగా, నీవు కూడా త్వరగా పెళ్లి ఆలోచన చేయాలని అంటున్నారట. మరి తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి, అనుష్క పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios