తెలుగు హీరోయిన్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్ కాజల్ ను ఇన్నేళ్లుగా ఆదరించినందుకు లవ్ యు ఆల్ అంటూ ట్వీట్ పదేళ్ల కెరీర్ లో  పడిపోయినప్పుడల్లా రెట్టింపు ఎనర్జీతో ఎగిసిపడ్డ కాజల్

'లవ్‌ యూ ఆల్‌..' అంటోంది కాజల్. తన సోషల్‌ మీడియా సైట్ లో.. తనను పదేళ్ళుగా ఆదరించిన వారికి థాంక్స్ చెప్పుకుంటూ అభిమానుల్ని 'టచ్‌' చేసింది అందాల చందమామ, గబ్బర్ యువరాణి, ఖైదీ అమ్మడు, చెర్రీ మిత్ర కాజల్‌ అగర్వాల్‌.

కాజల్‌ అగర్వాల్‌.. తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాలో కళ్యాణ్‌రామ్‌ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే, పెద్ద హీరోయిన్‌ అవుతుందనేలా పర్ఫామెన్స్ ఇచ్చింది కాజల్‌. తన కెరీర్లో ఫ్లాపులూ, హిట్లూ.. అన్నీ చవిచూసింది కాజల్‌. తన పనైపోయిందనుకునేలోపే... పెద్ద హిట్‌ ఖాతాలో వేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అదే కాజల్‌ అగర్వాల్‌ని పదేళ్ళపాటు సుదీర్థ కెరీర్ ఇవ్వటమే కాకుండా అగ్ర హీరోయిన్‌ లలో ఒకరిగా నిలబెట్టింది. 

'మగధీర' సినిమాతో కాజల్‌ అగర్వాల్‌కి ఇండస్ట్రీ హిట్‌ వుంది. తాజాగా ’ఖైదీ నెంబర్ 150‘ సినిమాతో మరో బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'చందమామ' సినిమాతో కెరీర్ బ్రేక్‌ దక్కించుకున్న కాజల్ తరువాత స్టార్ హీరోలందరితోనూ సక్సెస్ లు ఎన్నో ఇచ్చింది.

2016లో రెండు భారీ ఫ్లాపుల్ని చవిచూసిన కాజల్‌, ఇక తెలుగు తెరపై కనుమరుగవుతుందనుకునే టైమ్‌లోనే ఆమెకు 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో మెగాస్టార్ హీరోయిన్ గా ఛాన్సొచ్చింది. అంతే, కాజల్‌ కెరీర్‌ మళ్ళీ జోరందుకుంది. తమిళంలోనూ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్‌, బాలీవుడ్‌లోనూ సింగం తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌ సంగతెలా వున్నా, టాలీవుడ్‌ తనకు వెరీ వెరీ స్పెషల్‌ అని చెబుతుంటుంది కాజల్‌ అగర్వాల్‌.

తన చెల్లెలు నిషా అగర్వాల్‌ని టాలీవుడ్‌కి, అలాగే కోలీవుడ్‌కి కాజల్‌ పరిచయం చేసినా, ఆమె నిలదొక్కుకోలేకపోయింది. చెల్లెలికి పెళ్ళయిపోయింది కదా.? అనడిగితే.., 'నాకింకా పెళ్ళి వయసు రాలేదేమో..' అని చిరునవ్వుతో కొట్టి పారేయడం కాజల్‌కే చెల్లింది. సరిగ్గా ఫిబ్రవరి 15, 2007లో రిలీజైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రారంభించి ఈ 15కు పదేళ్లు గడిచాయి. తను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెబుతున్నానంటోంది కాజల్‌. విఇంకా చిత్రమేంటంటే తానెదుర్కొన్న 'స్ట్రగుల్స్‌'కు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పింది కాజల్. కాజలా మజాకా..

Scroll to load tweet…