Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణుకి ఓకే చెప్పిన కాజల్‌.. భయపెడుతున్న `కన్నప్ప`..

కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో మరింత జోరు పెంచుతుంది. ఆమె తాజాగా మరో పాన్‌ ఇండియా సినిమాకి సైన్‌ చేసింది. `కన్నప్ప`లో ఆమె భాగం కాబోతుందట. 
 

kajal key role in kannappa Manchu Vishnu frightening arj
Author
First Published May 17, 2024, 6:00 PM IST

కాజల్‌ అగర్వాల్‌ మళ్లీ పుంచుకుంటోంది. ఆమె పెళ్లి తర్వాత కొంత గ్యాప్‌ ఇచ్చింది. కుమారుడికి జన్మనిచ్చాక మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. తిరిగి ఫిట్‌నెస్‌ని పొందిన ఆమె హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చి సెకండ్‌ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతుంది. ఇప్పటికే `భగవంత్‌ కేసరి` చిత్రంలో మెరిసి మెప్పించింది. ఎంటర్‌టైన్‌ చేసింది. దీంతోపాటు ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ`లో నటిస్తుంది. ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీంతోపాటు ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది కాజల్‌. మంచు విష్ణుతో కలిసి నటిస్తుంది. 

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే భారీ కాస్టింగ్ యాడ్‌ అయ్యింది. దేశ వ్యాప్తంగా వివిధ లాంగ్వేజెస్‌కి చెందిన నటీనటులు నటీస్తున్నారు. సూపర్‌ స్టార్లు చేస్తున్నారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి బిగ్‌ స్టార్లని దించడం విశేషం. ఈ నేపథ్యంలో మరో స్టార్‌ హీరోయిన్‌ని దించాడు మంచు విష్ణు. కాజల్‌ని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. తాజాగా టీమ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

గతంలో మంచు విష్ణు, కాజల్ కలిసి `మోసగాళ్లు` చిత్రంలో నటించారు. అందులో విష్ణుకి సిస్టర్‌గా చేసింది కాజల్‌. అయితే ఆమె ఏ పాత్రలో కనిపించబోతుందనేది మాత్రం వెల్లడించలేదు. కానీ `కన్నప్ప`లో కాజల్‌ నటిస్తుందనే వార్త అభిమానులను అలరిస్తుంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది. అయితే సినిమాలో ఇప్పటికే భారీ కాస్టింగ్‌ నటిస్తుందనే విషయం తెలిసిందే. మంచు విష్ణు, మోహన్‌బాబుతోపాటు ప్రభాస్, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం, ఇప్పుడు కాజల్‌తోపాటు చాలా మంది నటిస్తున్నారు. వీరి పాత్రలు గెస్ట్ లుగా ఉంటాయని తెలుస్తుంది.

కాస్టింగ్‌ పెరిగే కొద్ది సినిమాపై అంచనాలు పెరుగుతాయి. కానీ ఆ అంచనాలను దాటి వెళ్తున్నట్టుగా ఉంది `కన్నప్ప`. ఇంతటి కాస్టింగ్‌ యాడ్‌ అవుతుండటంతో సినిమా సరైన ట్రాక్‌లోనే వెళ్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవర్‌ హైప్‌ అనర్థాలకు దారితీస్తుందని అంటారు. మరి `కన్నప్ప` విషయంలో అదే జరుగుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతటి కాస్టింగ్‌ని దర్శకుడు సరిగ్గా వాడుకుంటున్నారు, సరిగ్గా డీల్‌ చేస్తున్నారా అనే డౌట్‌ వస్తుంది. ప్రభాస్‌ వంటి బిగ్‌ స్టార్ అభిమానుల్లో ఇప్పుడు ఈ టెన్షన్‌ నెలకొంది. ఇంత మందిని తీసుకుని ఏం చేస్తున్నారనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా సరైన ట్రాక్‌లోనే ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 

గతంలో `ఎన్టీఆర్‌ కథానాయకు` సినిమా విషయంలోనూ అదే జరిగింది. అందులో భారీ కాస్టింగ్‌ని తీసుకున్నారు. చివరికి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. తమిళంలో వచ్చిన `పొన్నియిన్‌ సెల్వన్‌` కూడా భారీ కాస్టింగ్ తోనే వచ్చింది. కానీ సరిగ్గా ఆడలేదు. వాటిలా `కన్నప్ప` డిజప్పాయింట్‌ చేయదుగా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు అభిమానులు. అయితే ఇంత మంది బిగ్‌ స్టార్స్ ఒప్పుకున్నారంటే సినిమా ఆ స్థాయిలో ఉంటుందని ఓ వాదన కూడా వినిపిస్తుంది. ఏదైనా `కన్నప్ప` అందరి అభిమానులను భయపెడుతుందనేది వాస్తవం. 

ఇక ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తుండగా, మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. సినిమా ఎక్కువగా న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీలో కొంత భాగం షూట్‌ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ని ఈ నెల 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్‌లో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అక్షయ్‌ ది షూటింగ్‌ పూర్తి కాగా, ప్రభాస్‌పై షూట్‌ చేస్తున్నట్టు సమాచారం.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios