నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన కాజల్ ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కాజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని టాక్
అందం, అభినయం కలగలిసిన నటి.. కాజల్ అగర్వాల్. తెలుగు సినీరంగ ప్రవవేశం చేసి 10ఏళ్ల దాటింది. మొదటి సినిమా తేజ దర్శకత్వంలో ‘ లక్ష్మీ కల్యాణం’ లో నటించిన కాజల్.. తన 50వ చిత్రం కూడా తేజ దర్శకత్వంలోనే నటించారు. అదే నేనే రాజు నేనే మంత్రి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ రాధ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కాజల్.. వరుసగా సినిమా అవకాశాలను కూడా చేచిక్కించుకుంటోంది. అయితే.. తాజాగా కాజల్ కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. ముంబయి కి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్ లవ్ లో ఉందట. త్వరలోనే అతనిని వివాహం చేసుకోబోతోందని ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. ఆ వ్యాపారవేత్తతో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని పరిశ్రమ వర్గాలు కూడా చెబుతున్నాయి.
అతనితో కలిసి ఇటీవల వెకేషన్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు కూడా వెళ్లిందనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో.. నిజమైతే కాజల్ ని చేసుకునే ఆ అదృష్టవంతుడెవరో వేచి చూడాలి.
