జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్న టాలీవుడ్ చందమామ కాజల్ రీసెంట్ గా కోలీవుడ్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుంది. తెలుగులో రణరంగం సినిమా ఉహించినంతగా సక్సెస్ కాకపోవడంతో కాస్త డీలా పడ్డ బేబీకి తమిళ్ లో జయం రవి కోమలి సినిమా కాస్త  బూస్ట్ ఇచ్చింది. 

పెద్దగా అంచనాలు లేకుండా ఆగస్ట్ 15న విడుదలైన కోమలి సినిమా ఊహించని విధంగా మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక ఆరు రోజుల్లోనే  కోమలి 25కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది. మంచి సోషల్ పాయింట్ తో కామెడీ  ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమా కోసం జయం రవి చాలా కష్టపడ్డాడు. 

సినిమాలో టీనేజ్ కుర్రాడిలా కనిపించాలని 20కేజీల బరువు తగ్గాడు. ఇక మొత్తానికి కాజల్ కూడా సినిమాలో అద్భుతంగా నటించి కోలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటింది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె గణేష్ నిర్మించారు.