మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'తేరి' సినిమా రీమేక్ లో రవితేజ నటించనున్నాడు. దీనికి 'కనకదుర్గ' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో సమంత, అమీ జాక్సన్ నటించగా.. తెలుగులో కాజల్, కేథరిన్ త్రెసాని ఎంపిక చేసుకున్నారు.

కథ ప్రకారం.. సినిమాలో రవితేజకి భార్యగా కాజల్ కనిపించనుందని సమాచారం. గతంలో కూడా ఈ జంట రెండు సినిమాలకు కలిసి పని చేశారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు. కానీ పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో రవితేజతో కానిచ్చేస్తున్నారు.