సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్ తనయుడిగా యువ హీరో సాయి శ్రీనివాస్ సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చాడు. డాన్సులు, నటన పరంగా ఈ యువ హీరోకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీనివాస్ నటిస్తున చిత్రాలు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. కానీ ఇంతవరకు ఆశించిన స్థాయి విజయం మాత్రం బెల్లంకొండ వారసుడికి దక్కలేదు. శ్రీనివాస్ ప్రస్తుతం డిక్టేటర్ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తునాడు. తాజాగా సమాచారం ప్రకారం శ్రీనివాస్ తదుపరి చిత్రం కుడా ఒకే అయినట్లు తెలుస్తోంది. డెబ్యు దర్శకుడు నాని ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తారట.

 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేసేందుకు సిద్దం అవుతునట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీనివాస్ ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ తో నే నటిస్తూ వచ్చాడు. శ్రీనివాస్ నటించిన తొలి చిత్రం అల్లుడు శ్రీను. సమంత కథానాయిక. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందింది. కాని కమర్షియల్ గా విజయం సాధించలేక పోయింది.

 

సాధారణంగా ఐటెం సాంగ్స్ కి స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపరు. కాని తమన్నా రెండు చిత్రాల్లో శ్రీనివాస్ పక్కన ఐటమ్స్ లో చిందేసింది. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు చిత్రాల్లో తమన్నా శ్రీనివాస్ తో స్టెప్పులేసింది. గత ఏడాది విడుదలైన జయజానకి నాయక చిత్రంలో కుడా భారీ కాస్టింగ్. ఈ చిత్రం కాస్త పరవాలేదనిపించింది. కాని శ్రీనివాస్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చేలా మాత్రం ఆడలేదు. ఈ చిత్రంలో రకుల్, ప్రగ్య జైస్వాల్ లు శ్రీనివాస్ తో రొమాన్స్ చేశారు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కుడా శ్రీనివాస్ కు జోడిగా క్రేజీ హీరొయిన్ నే ఎంపిక చేశారు. డిజే హీరొయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన నటిస్తోంది.

 

ఇక కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. సౌత్ లోని స్టార్ హీరోలందరితో కాజల్ నటించింది. ఇప్పటికి ఈ అందాల చందమామ కోసం హీరోలు, దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇలాంటి తరుణంలో కాజల్ శ్రీనివాస్ లాంటి యువ హీరో చిత్రానికి ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి సమంత, రకుల్ , తమన్నా వంటి హీరోయిన్ల హ్యాండ్ పడినా శ్రీనివాస్ కు సక్సెస్ రాలేదు. పూజా హెగ్డే, కాజల్ లతో అయినా శ్రీనివాస్ బ్రాండెడ్ హీరోగా మారుతాడా అన్నది చూడాలి.