కాజల్ అగర్వాల్ అందాల చందమామగా మనందరికీ తెలుసు. కాజల్ ఎప్పుడూ చిరునవ్వుతో మెరుపుతో కూడిన ముఖంతో అందాల దేవతలా కనిపిస్తుంది. సినీ తారలు మేకప్ లేకుండా కూడా అంతే అందంగా కనిపించేవారు చాలా తక్కువ. చాలా మంది హీరోయిన్లు మేకప్ లేకుండా కనిపించడానికి భయపడతారు. ఆ సాహసాన్ని కాజల్ అగర్వాల్ చేసింది. తన అసలు స్వరూపం ఇదే అంటూ మేకప్ లేకుండా ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

కాజల్ ముఖం చిన్న చిన్నని మచ్చలతో కనిపిస్తోంది. అయినా కూడా కాజల్ సెక్సీగానే ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోల ద్వారా కాజల్ ఇవ్వాలనుకున్న సందేశం ఇదే. మన అసలు అందాన్ని దాచిపెట్టేసి మేకప్పులు కోసం ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం. అలా చేయాల్సిన అవసరం లేదు. అలా చేయాల్సిన అవసరం లేదు మన సహజసిద్ధమైన లుక్ తోనే హాట్ గా కనిపించవచ్చు అని కాజల్ చెబుతోంది. 

మన నేచురల్ లుక్ లో కనిపించాలంటే ధైర్యం ఉండాలి. మనలో మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మొదట మన శరీరాన్ని మనం అంగీకరించాలి. అప్పుడే మనలో ఆత్మవిశ్వాసాన్ని చూసి ఎదుటివారు కూడా గౌరవిస్తారు అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఎన్నడూ లేనివిధంగా ఉన్న కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.