పోలీసులు వద్దంటే కాజల్ ఏం చేసిందో చూడండి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Aug 2018, 1:28 PM IST
Kajal Aggarwal's Kiki Challenge with Bellamkonda Sreenivas
Highlights

 వెరైటీగా ఇద్దరూ వీల్ చైర్ మీద కూర్చొని దాని మీద నుండి లేచి డాన్స్ చేశారు. అంతేకాదు.. కార్ నుండి దిగి డాన్స్ చేసే వంటి ప్రమాదకర పనులు కాకుండా తమలా కొత్తగా ఆలోచించమని మెసేజ్ కూడా ఇచ్చారు. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

హాలీవుడ్ నుండి దక్షిణాదికి పాకిన కికి ఛాలెంజ్ ప్రమాదకరమని ఇక్కడి పోలీసులు దీన్ని బ్యాన్ చేశారు. ఎవరినీ కికి ఛాలెంజ్ లో పాల్గొనొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కాజల్ తన కో స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ఈ పైకి ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అయితే అందరిలా వీరిద్దరూ కార్ నుండి బయటకి దిగి డాన్స్ చేయకుండా వినూత్నంగా ప్రయత్నించారు.

వెరైటీగా ఇద్దరూ వీల్ చైర్ మీద కూర్చొని దాని మీద నుండి లేచి డాన్స్ చేశారు. అంతేకాదు.. కార్ నుండి దిగి డాన్స్ చేసే వంటి ప్రమాదకర పనులు కాకుండా తమలా కొత్తగా ఆలోచించమని మెసేజ్ కూడా ఇచ్చారు. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఆదా శర్మ, రెజీనా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

ఆదా ఆగిఉన్న కార్ లో నుండి దిగి డాన్స్ చేయగా, రెజీనా మాత్రం కదులుతున్న కార్ లో నుండి బయటకి దిగి డాన్స్ చేసి మళ్లీ కార్ లోకి వెళ్లింది. ఇలా చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఇక ఆ తరువాత సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంది లేదు. తాజాగా కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం సరికొత్త రీతిలో ఈ ఛాలెంజ్ స్వీకరించి వార్తల్లో నిలిచారు. 

 

loader