తెలుగు సినీ పరిశ్రమలో కాజల్ అగర్వాల్ తనకంటూ ప్రత్యేక స్థానం సంంపాదించుకుంది. ఓ రెండేళ్ల క్రితం కెరియర్ దాదాపు ముగిసిందనేలా పెట్టా బేడా సర్ధేయడానికి సిద్ధమైన కాజల్ సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి ఖైది నెంబర్ 150 ఆఫర్ ఓకే చేయడం ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో.. అమ్మడి రేంజ్ మరింత పెంచింది. ఆ సినిమా హిట్ తో కెరియర్ లో మళ్లీ జోష్ అందుకున్న కాజల్ ఆ తర్వాత వరుస ఛాన్సులు అందుకుంది.

 

 

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన నటించిన కాజల్ గ్లామర్ అందరిని ఆశ్చర్యపరచింది. అయితే ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట అమ్మడు. ఇన్నాళ్లు కోటి, కోటి పాతిక ఉన్న అమ్మడి రెమ్యునరేషన్ ఇప్పుడు 1.75 దాకా వెళ్లిందని టాక్.

 

అంతేకాదు ఈమధ్య ఓ యువ హీరో సినిమాలో నటించాలని ఆమెను కోరగా ఏకంగా 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగేసిందట అమ్మడు. ఈ లెక్కన చూస్తే కాజల్ రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని భావించింది కాబోలు తనని సంప్రదించిన నిర్మాతలకు మాత్రం చుక్కలు చూపించే రేటు చెబుతుందట.

 

అందులో బేరాలాడటం కూడా ఉండదని కచ్చితంగా చెప్పేస్తుందట. మొత్తానికి కాజల్ ఈ ఫాం ఎన్ని రోజులు కొనసాగిస్తుందో తెలియదు కాని అమ్మడి డిమాండ్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో చేసే హీరోయిన్ ఎవరు లేకపోబట్టే కాజల్ డిమాండ్ పెరిగింది. మరి అమ్మడు ఈ హవా మరిన్ని రోజులు కొనసాగిస్తుందా లేదా చూడాలి.