Asianet News TeluguAsianet News Telugu

కాజల్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్, రియల్ ఫ్యామిలీ స్టార్ తో రీల్ ఫ్యామిలీ స్టార్ టీమ్..హార్ట్ టచింగ్

తన కుటుంబానికి సపోర్ట్ గా నిలబడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది.

kajal aggarwal latest movie will release direct ott release dtr
Author
First Published Apr 8, 2024, 10:22 PM IST

దివ్యాంగురాలైన రియల్ ఫ్యామిలీ స్టార్ ను కలిసిన ఫ్యామిలీ స్టార్ టీం.. 

తన కుటుంబానికి సపోర్ట్ గా నిలబడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలోని కాన్సెప్ట్ లాగే రియల్ లైఫ్ లోని ఫ్యామిలీ స్టార్స్ దగ్గరకు వెళ్లి సర్ ప్రైజ్ విజిటింగ్ చేస్తోంది ఫ్యామిలీ స్టార్ టీమ్. మీమర్స్ తో నిర్మాత దిల్ రాజు మీట్ లో ప్రశాంత్ అనే మీమర్ తమ కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ తన సోదరి స్వరూప అని చెప్పి దివ్యాంగురాలైన తన సోదరి కుటుంబానికి ఎలా అండగా నిలబడిందో వివరించాడు. అతని మాటలు విన్న నిర్మాత దిల్ రాజు మీ ఇంటికి వస్తామని మాటిచ్చారు.
kajal aggarwal latest movie will release direct ott release dtr
మాటిచ్చినట్లే ఇవాళ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు , దర్శకుడు పరశురామ్ హైదరాబాద్ సూరారంలోని ఆ సోదరి ఇంటికి వెళ్లారు. తమ ఇంటికి విజయ్, దిల్ రాజు రాకతో ఆమె సర్ ప్రైజ్ అయ్యింది. ఆ కుటుంబంతో కాసేపు మాట్లాడారు దిల్ రాజు, విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ సినిమాను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశామని, విజయ్, బామ్మ మధ్య వచ్చే సీన్స్ నవ్వించాయని, ఫ్యామిలీ స్టార్ లోని క్యారెక్టర్స్ తో, ఎమోషన్స్ తో బాగా రిలేట్ అయ్యామని ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండకు చెప్పారు. ఇలాగే త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఫ్యామిలీ స్టార్స్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిట్ చేయనుంది.

కాజల్ నటించిన చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ 

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో దీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక. థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమా లో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అవుతోంది. కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కామెడీ, హర్రర్ లవర్స్ ఏప్రిల్ 9న ఆహా లో ఈ సినిమా చూసేయండి.

kajal aggarwal latest movie will release direct ott release dtr

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా అనిపించింది. 5 వేర్వేరు కథలతో కాజల్ కి రెజీనాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీ ఉంటునే హర్రర్ ఇంపాక్ట్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఒక మంచి కామెడీ హర్రర్ ఫిలిం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' హనుమాన్ మీడియా ద్వారా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios