సీత, రణరంగం డిజాస్టర్స్ అవటంతో కాజల్ అగర్వాల్ పరిస్దితి తెలుగులో చాలా కష్టంగా మారింది. మరో ప్రక్క భారతీయుడు 2 మీద చాలా ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా ఇప్పుడిప్పుడే పూర్తయ్యి థియోటర్స్ లో దిగేటట్లు కనపడటం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ క్వీన్ చిత్రం రీమేక్ ప్యారిస్ ప్యారిస్ సెన్సార్ దగ్గర పురిటి నెప్పులు పడుతోంది. 

తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేని ఈ టైమ్ లో అజయ్ భూపతి చిత్రం మహా సముద్రంలో రవితేజ సరసన ఛాన్స్ వచ్చింది. అయితే అదీ బుస్సే అని తేలిపోయింది. రవితేజ వేరే చిత్రం కమిటవ్వటంతో మహా సముద్రం ప్రక్కకు వెళ్లిపోయింది. ఆ దర్శకుడు నాగచైతన్యతో ట్రైల్స్ లో ఉన్నాడు. అయితే నాగచైతన్య సరసన కాజల్ ని తీసుకోవటం అనేది కష్టం. దాంతో కాజల్ కు చేతిలో ఒక్క ప్రాజెక్టు లేక పిచ్చిక్కినట్లు ఉందిట. రోజూ తెల్లారగానే షూటింగ్ వెళ్లటం అలవాటైన ఆమె గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటోంది. 

అయితే ఇది హీరోయిన్ గా ఆమె రిటైర్మెంట్ టైమ్ అని, నెక్ట్స్ లెవిల్ కు కాజల్ వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు. పోనీ తన తోటి హీరోయిన్స్ త్రిష, నయనతార, శ్రేయ లాగ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేద్దామా అంటే...ఆమె పై ఇండిడ్యువల్ గా బిజినెస్ జరిగే పరిస్దితి లేదు. దాంతో ఇప్పుడు ఏ వైపు టర్న్ తీసుకోవాలి. పెళ్లి చేసుకుని సెటిలై , మళ్లీ అక్క, అమ్మ పాత్రలతో ఎంట్రీ ఇవ్వాలా ...ఏం చేయాలి..అనే ఆలోచన లో ఉందిట. అయితే సీనియర్ హీరోలకు జంట దొరకటని సిట్యువేషన్ లో ఆమెకు ఆ యాంగిల్ లో ఆఫర్స్ రావచ్చేమో ..చూడాలి.