నాలుగు రోజుల క్రితం తన చిరకాల మిత్రుడు మరియు బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. కరోనా నేపథ్యంలో కేవలం అత్యంత సన్నిహితులు, బంధులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కావడం జరిగింది. హనీమూన్ ప్లాన్స్ లో కాజల్-కిచ్లు ఉన్నారంటూ వార్తలు వస్తుండగా కాజల్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు, నేను నో చెప్పేస్తా, అని కామెంట్ పెట్టిన అందరినీ షాక్ కి గురి చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🙏🏻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 3, 2020 at 1:54am PST

కాజల్ మరో ఫొటోలో వివరంగా తన పోస్ట్ వెనుక కారణం ఏమిటో తెలియజేసింది. ''నేను కొంచెం లేటుగా స్పందిస్తున్నాని నాకు తెలుసు, ఈ పని నేను గతంలోనే చేసి ఉండాల్సింది. అయినా పర్వాలేదు. ఈ ప్రపంచానికి నా భావాలు లెటర్ లో తెలియజేస్తున్నందుకు క్షమించండి, కానీ నేను ఈ విధంగా సులభంగా చెప్పగలను. చెప్పకుండా తర్వాత బాధ పడేకంటే ఈ అత్యవసర పరిస్థితిలో ఈ విషయం చెప్పడమే మంచిది. 

ఒక చిన్న వైరస్ ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చి వేస్తుందని ఎప్పుడూ నేను ఊహించలేదు. పరిష్కారం లేని, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం నన్ను భయానికి గురి చేస్తుంది. భవిష్యత్ గురించిన నా ఆలోచనలు మార్చి వేస్తుంది. నాకు మరియు ప్రపంచానికి ఈ వైరస్ అనేక సవాళ్లు విసురుతుంది. ప్రస్తుత మన పరిస్థితిని నేను అంగీకరించను, కొనసాగుతున్న భయానికి, అనిశ్చితికి నేను నో చెవుతున్నాను'' అని కాజల్ సుదీర్ఘ సందేశం వెళ్లబుచ్చారు. 

వైరస్ కి భయపడకుండా ఎదుర్కోవాలని కాజల్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మరో అర్థం కూడా ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. గౌతమ్ కి ఆమె నో చెప్పనున్నారా, వీరిద్దరి మధ్య అప్పుడే గొడవలు వచ్చాయని కొందరు భావించారు. పీవీ సింధు సైతం రిటైర్ అవుతున్నాని పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.