టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ కి ఓ క్రేజీ ఆఫర్ దక్కింది. ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. జెఫ్రీ గీ చిన్ అనే హాంగ్ కాంగ్ దర్శకుడు ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇందులో మంచు విష్ణు, కాజల్ జంటగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మరోకొత్త న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలే లేని కాజల్ కి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరోగా మంచు విష్ణు కనిపిస్తే, హిందీలో మరో హీరో, హాలీవుడ్ లో మరో హీరో కనిపిస్తారట. 

ఇక్కడ హీరోలు మారుతున్నప్పటికీ మూడు భాషల్లో హీరోయిన్ గా మాత్రం కాజలే కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కాజల్ తో పాటు మరో హాలీవుడ్ బ్యూటీ కనిపించనుందని తెలుస్తోంది. 

ఆమె మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తే.. కాజల్ ఒక ఎపిసోడ్ లో హీరోయిన్ గా కనిపిస్తుందట. తెలుగులో 'కవచం', 'సీత' అంటూ వరుసగా ఫ్లాప్ లు అందుకుంటున్న కాజల్ కి ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి!