అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురలో సినిమా రిలీజ్ కావడానికి సమయం చాలానే ఉన్నా సినిమాకు సంబందించిన ఎదో ఒక న్యూస్ అభిమానుల్లో అంచనాలను రేపుతోంది. స్టైలిష్ స్టార్ సినిమా అంటేనే అందులో స్పెషల్ గా చెప్పుకునే డ్యాన్స్ మూమెంట్స్ తప్పకుండా ఉండాలి. 

బన్నీతో డ్యాన్స్ అంటే హీరోయిన్స్ లో అలజడి మొదలవుతుంది. ఇక ఇప్పుడు కాజల్ కూడా బన్నీతో స్టెప్పులేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్య సినిమాలో అలాగే ఎవడు సినిమాలో ఈ జంట ఒకే ఫ్రెమ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు స్పెషల్ గా ఐటెమ్ సాంగ్ లో కనిపించబోతున్నారు. 

కాజల్ పదేళ్ల నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఇక ఇప్పుడు ఐటెమ్ సాంగ్ ద్వారా అమ్మడు మాటల మాంత్రికుడు సినిమాలో కనిపించడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం సినిమా కోసం వేసిన 5కోట్ల ఖరీదైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.