టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజిగా మారింది. పోటీగా ఎంత మంది కుర్ర హీరోయిన్స్ వచ్చినా బేబీ గ్లామర్ కి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో బంపర్ అఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. 

మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మినీ మల్టీస్టారర్ ముంబై సాగా లో కాజల్ అగర్వాల్ కి చోటు దక్కింది. జాన్ అబ్రహం సరసన బేబీ రొమాన్స్ చేయనున్నట్లు టాక్. గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఎక్కువగా 1980-90ల  కాలానికి సంబందించిన స్క్రీన్ ప్లేతో నడుస్తుందని సమాచారం. 

రీసెంట్ గా పట్టాలెక్కిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ - జాకీ ష్రాఫ్ - సునీల్ శెట్టి రోహిత్ రాయ్ వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తుండాగా టి సిరీస్ బారి బడ్జెట్ తో ముంబై సాగాను నిర్మించనుంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ లో చిత్రాన్ని విడుదల చేయాలనీ టార్గెట్ సెట్ చేసుకున్నారు.