రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోని. ఈ సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా శ్రీను కెరీర్కు చాలా ముఖ్యమైన సినిమా. ఇది హిట్ అయితేనే అతనికి టాలీవుడ్ మళ్లీ మరో అవకాశం దక్కేది. ఇది కూడా పాత సినిమాల్లాగే అట్టర్ ఫ్లాప్ అయితే... మూట ముల్లె సర్దుకోవాల్సిందే. 

అమర్ అక్బర్ ఆంటోనీలో రవితేజ ముగ్గురిగా కనిపించబోతున్నాడంటే... హీరోయిన్లు కూడా ముగ్గురుండాలిగా. ప్రస్తుతానికైనా ఇద్దరిని పెడుతున్నట్టు సమాచారం. అందులో ఒక హీరోయిన్ గా అను ఇమ్యాన్యుయేల్ ఓకే అయింది. నిజానికి అను కన్నా ముందు కాజల్ ను పెట్టాలనుకున్నాడు శ్రీను వైట్ల.  ఎందుకంటే  కాజల్ తన సినిమాలో అదృష్టం కలిసివస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. ఆమెను సంప్రదించాడు కూడా. కాజల్ కథ వినకుండానే నో చెప్పేసిందని తెలుస్తోంది. దానికి కాజల్ చెప్పే కారణాలు కూడా సరైనవేలా కనిపిస్తున్నాయి. శ్రీను వైట్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అలాగే రవితేజ పరిస్థితి అలాగే ఉంది. గతంలో రవితేజతో తాను చేసిన సినిమాలు కూడా ఏమాత్రం ఆడలేదు. మళ్లీ అదే దర్శకుడు... అదే హీరోతో చేస్తే... ఫలితం కూడా అలాగే ఉంటుందేమో అని కాజల్ భావించిందట.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఆ నిర్మాణసంస్థ చాలా తక్కువ బడ్జెట్ సినిమాను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉందట. అంటే తాను రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా తగ్గించుకోవాలి. అందుకే అసలు ఆ ప్రాజెక్టే చేయకూడదని కాజల్ నిర్ణయించుకుందట. ఇదే విషయాన్ని శ్రీను వైట్లకే నేరుగా చెప్పేసిందని టాక్. దాంతో అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్ గా నివేదా థామస్ ను అనుకుంటోంది చిత్ర యూనిట్.