ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి ముద్దుగుమ్మలైనా సై అంటున్నారు. బాలీవుడ్ నటీమణులు కూడా ఏ మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ప్రభాస్ అనగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సాహో సినిమాలో ప్రభాస్ తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జత కట్టిన సంగతి తెలిసిందే. అలాగే మరో హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఒక పాటలో కనిపించింది. 

అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు బాలీవుడ్ లో ఒక గాసిప్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని కాజల్ ని మాత్రం సాహో సినిమాలో ఒక సాంగ్ కోసం అడిగారట. కానీ కాజల్ అందుకు రెండు కోట్ల వరకు డిమాండ్ చేయడంతో చిత్ర నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

ఇక 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ్ హిందీ మలయాళంలో ఒకేసారి సినిమా విడుదలకానుంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభాస్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు