చందమామ కాజల్ ప్రస్తుతం సూపర్ హ్యాపీ మూడ్ లో ఉంది. కోరుకున్న ప్రియుడు గౌతమ్ ని పెళ్లి చేసుకున్న కాజల్ చాలా ఎక్సయిట్మెంట్ ఫీలవుతున్నారు. పెళ్లి వేడుక ముందు తరువాత కాజల్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాగా కాజల్- గౌతమ్ హానీమూన్ కి చెక్కేస్తున్నారట. బ్యాగ్స్ ప్యాక్ చేశాం అని, పాస్ పోర్ట్ సిద్ధంగా ఉన్నాయని కాజల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్ ల పాస్ పోర్ట్ లను ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. 

మరి హనీమూన్ కోసం కాజల్, గౌతమ్ ఎక్కడికి వెళుతున్నారనేది చెప్పలేదు. మొత్తానికి వీరు విదేశాల్లో ఎదో ఒక రొమాంటిక్ కంట్రీకి వెళ్లనున్నారని సమాచారం. ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు ప్రియుడు అయిన గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30వ తేదీన కాజల్ ని వివాహం చేసుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అత్యంత సన్నిహితులు మరియు బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. 

పరిమిత సంఖ్యలో అతిథులు వచ్చినప్పటికీ కాజల్ వివాహం చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. మరో వైపు కాజల్ అనేక ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి వుంది. ఈనెల 9నుండి ఆచార్య షూటింగ్ మొదలకానున్న నేపథ్యంలో త్వరలోనే కాజల్ ఈ ప్రాజెక్ట్ సెట్స్ లో జాయిన్ కావాలి. అలాగే కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 మరియు మోసగాళ్లు చిత్రాల షూటింగ్స్ లో కూడా కాజల్ పాల్గొనాల్సి వుంది. ఆ చిత్రాల షూటింగ్స్ మొదలయ్యే లోపు కాజల్-కిచ్లు హనీమూన్ ముగించుకోవాలని ప్లాన్ చేశారు.