కాలేజీ రోజుల్లో అబ్బాయిలు తెగవెంటపడ్డారంటున్న కాజల్ తనకు గర్వంగా, థ్రిల్లింగ్ గా అనిపించేదట ఇప్పుడైతే అలాంటిదంతా కామన్ అయిపోయిందంటోంది

లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి... దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో తిరుగులేదని అనిపించుకుందగి కాజల్ అగర్వాల్. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ లో హిరోయిన్ గా మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ సరసన నటించిన కాజల్ ఇప్పడయితే హీరోయిన్ అయ్యి ఫాలోయింగ్ పెరిగింది కానీ.. తనకు కాలేజీ చదివే రోజుల్లో కూడా అదోరకం ఫాలోయింగ్ వుండేదని, ఆ రోజుల్లో కూడా అబ్బాయిలు తన వెంటపడ్డాని అమ్మడు చెప్తోంది. తన కాలేజీ రోజుల్లో కాజల్ అబ్బాయిలు వెంట పడుతుంటే చిరాకు పడ్డట్టు నటిస్తునే లోలోపల గర్వంగా ఫీలయ్యేదట. 

”కాలేజీ రోజులు మర్చిపోలేను. చదువు ,పేరెంట్స్, ఫ్రెండ్స్ .. ఇలా సమయం తెలిసేది కాదు. అందులోనూ ఆ రోజుల్లు అబ్బాయిలు నా వెంట పడటం వుండేది. పైకి కొంచెం చిరాకు నటించినా కాస్తంత గర్వంగా ఉండేది. ఆ వయసులో అది సాధారణమే కదా. అదంతా ఆకర్షణే. దీనికితోడు అబ్బాయిలు మా గురించి ఆలోచిస్తూ, మమ్మల్నే చూస్తుంటే గర్వంగానూ ఉంటుంది. వాళ్లపై ఇంట్లో ఫిర్యాదు చేసేదాన్ని కాదు. కేవలం ఆ ఎక్స్ పీరియన్స్ ను ఫీల్ అయ్యదేదానిని . అయితే సినిమాల్లోకి వచ్చాక ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. కాలేజీ రోజుల్లో వుండే ఫీలింగ్సే వేరు” అని చెప్పుకొచ్చింది కాజల్.