సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హీరోయిన్లు అందరూ పెళ్లి చేసుకుంటుండడంతో కాజల్ కి కూడా మీడియా నుండి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాపైనే ఉందని అన్నారు. పెళ్లి చేసుకోవాల్సి వస్తే సినీ పరిశ్రమకు చెందిన వారిని మాత్రం చేసుకోనని వెల్లడించారు.

తనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు  ఉన్నారని, కానీ వాళ్లలో ఎవరినీ జీవితభాగస్వామిగా ఊహించుకోలేనని అన్నారు. ఒకవేళ ఇండస్ట్రీకి చెందిన వారు వచ్చినా.. అతను తన పనిని గౌరవించి, అర్ధం చేసుకునే వ్యక్తి అయితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కాజల్ క్వీన్ సినిమా రీమేక్ లో నటిస్తోంది. అలానే కమల్ హాసన్ తో కలిసి 'భారతీయుడు 2' సినిమాలో నటించడానికి సిద్ధమైంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది.