టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కాజల్ నెక్స్ట్ హాలీవుడ్ తెరపై కనిపించబోతోంది. అయితే ఆ సినిమాకు టాలీవుడ్ సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. మంచు హీరో విష్ణు ఆ సినిమాను నిర్మించబోతున్నాడు.

ప్రయోగాత్మకంగా తెరక్కనున్న ఆ ఇంగ్లీష్ చిత్రంలో కాజల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు హాలీవుడ్ దర్శకుడితో ఒక డిఫరెంట్ మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం VMR ఎంటర్టైన్మెంట్స్ అని ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. 

ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి సినిమాను తెరకెక్కించనున్నారు. కాన్సెప్ట్ ను ఇటీవల విన్న కాజల్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.