బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ 30 దాటగానే ఇష్టమైన యువకులను పసిగట్టి మనువాడేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కెరీర్ అంటూ ఇంకా ఆలస్యం చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల కాజల్ దగ్గరికి పెళ్లి ప్రస్తావన రాగానే ఊహించని సమాధానం ఇచ్చింది. చాలా బిజీ అంటూ పెళ్లికి టైమ్ లేదని అంటోంది. 

కాజల్ అగర్వాల్ ఈ నెల 7న కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమాపై ఓ వర్గం వారిలో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో కాజల్ తెగ పాల్గొంటోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

ప్రస్తుతం నా కెరీర్ పీక్ లో ఉంది. గత ఏడాది నుంచి షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నాను. వచ్చే ఏడాది ఇంకా బిజీ. కమల్ హాసన్ గారితో భారతీయుడు సీక్వెల్ లో అవకాశం దొరకడం నా అదృష్టం. అయితే సినిమాలతోనే నా జీవితం సాగిపోతోంది. ఇక పెళ్లి గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంది అంటూ.. ఇప్పుడైతే పెళ్లి చేసుకోవడానికి టైమ్ లేదని ఈ చందమామ క్లారిటీ ఇచ్చింది. అంటే సమయం దొరికితే.. అమ్మడు పెళ్లి న్యూస్ తో సడన్ షాక్ ఇస్తుందో.. ఏంటో మరి?