కడప జిల్లాలో ఓ కానిస్టేబుల్ కూతురు నానా హంగామా చేసింది. ఏకంగా ఎస్ఐనే బెదిరించింది. నేను ఎవరో తెలుసా..? నా తడాకా ఏంటో నీకు చూపిస్తానంటూ హడావిడి చేసింది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. సదరు యువతి త్రిపుల్ రైడింగ్ లో దొరికింది. బండిపై ముగ్గురు ప్రయాణించడం నేరమని..వాళ్ల వెహికల్ ని ట్రాఫిక్  పోలీసులు అడ్డుకున్నారు. అంతే ఆ అమ్మాయి ఆవేశంతో ఊగిపోయింది. తాను కానిస్టేబుల్ కూతురని చెప్పింది. వెంటనే వాళ్ల నాన్న కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఓ పక్క తండ్రితో మాట్లాడుతూనే మరోవైపు ఎస్ఐ ని బెదిరించింది.  ఆ అమ్మాయి వ్యవహారం చూసి చిర్రెత్తిపోయిన ఎస్ఐ.. మీ నాన్న ఉద్యోగం పీకించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ తతంగమంతా వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.