Asianet News TeluguAsianet News Telugu

సామాజిక సేవ అనగానే మెగాస్టార్ చిరు 2 లక్షలిచ్చారు

  • సినీ కార్మికుల సహాయం కోసం మనం సైతం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కాదంబరి కిరణ్
  • సామాజిక సేవ అనగానే మెగాస్టార్ చిరు 2 లక్షలిచ్చారు-కాదంబరి
  • ఈ సంస్థలో రాజకీయ చెత్త చేరనియ్యొద్దన్న వివినాయక్
kadambari kiran manam saitham foundation gets appreciations

అనారోగ్యం కారణంగానో, మరేదైనా కానీ కష్టాలపాలైన సినిమా ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, సినిమా కార్మికులకు, పేదలకు సహాయం కోసం ఏర్పాటైన సంస్థ 'మనం సైతం'. నటుడు కాదంబరి కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ సంస్థకు మెగా స్టార్ చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు తమవంతు సహాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఈ సంస్థకు తన వంతుగా సహాయం అందించిన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

 

‘మనం సైతం' అనే సంస్థ సినిమా ఇండస్ట్రీ వారిచే, వారి సహాయంతో ముందుకు సాగుతున్న సంస్థ కావడం గర్వకారణంగా ఉంది. కాదంబరి కిరణ్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటువంటి సంస్థలు పెరుగుతున్నపుడు పదవులు, ఎలక్షన్లు, రాజకీయాలు ఈ చెత్తంతా చేరుతుంది. ఈ సంస్థలో అలాంటివి చేరకుండా చూడాలి. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఉంటాయన్నట్లు... దయచేసి ఆ పరిస్థితి ఒక మంచి సంస్థకు రానివ్వద్దు.... అని వివి వినాయక్ అన్నారు. నా తరుపున ఒక లక్ష రూపాయలు కిరణ్ గారికి ఇస్తున్నాను. దాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడికొచ్చే గెస్టులకు ఈ శాలువాలు కూడా ఇవ్వద్దు. ఈ ఖర్చు కూడా అనవసరంగా పెట్టవద్దు. ఇది కూడా ఓ పేదవాడికి పెట్టండి అని వివి వినాయక్ సూచించారు.

 

ఇక ఒక ఉద్యమంలా మొదలు పెట్టిన ‘మనం సైతం' సంస్థకు సినిమా పెద్దల దీవెనలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టం. మా లాంటి చిన్న వారికి ఏదైనా కష్టం వస్తే ఎవరూ చెప్పుకునే వారు కాదు. కష్టంలో ఉన్న మనిషిని దగ్గరికి రానివ్వరు, అవకాశం ఇవ్వరు అనే అపోహ ఉండేది. నేను చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కాదని తేలింది. పెద్దలందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారు, మనకు వెన్నంటి ఉంటారని నమ్మి నేను కష్టం చెప్పుకోవడం మొదలు పెట్టాను..., పెద్దలు ఇచ్చి సహాయాన్ని, ధైర్యాన్ని పేదల వరకు తీసుకెళ్లగలుతున్నాను అని కాదంబరి కిరణ్ అన్నారు.

 

చిరంజీవిగారు 2 లక్షల ఏనుగుల బలం ఇచ్చారు

చిరంజీవిగారు ఇంటికి పిలిచి నువ్వు చేసే కార్యక్రమాలు చాలా బావున్నాయి, ఈ క్షణం నుండి నేను నీ వెనకాల ఉన్నానని బయటకు వెళ్లి చెప్పుకో, అప్పటి వరకు ఖర్చు పెట్టు అని 2 లక్షలు ఇచ్చారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఏ ధైర్యం కావాలన్నా నేను ఉన్నా, ఏ ఆసుపత్రికి ఫోన్ చేయాలన్నా నేనున్నాను, ఎక్కడి రావాలన్నా నేను సిద్ధమే అని చెప్పి.... 2 లక్షల రూపాయలు ఇచ్చి రెండు లక్షల ఏనుగుల బలాన్ని నాకు ఇచ్చారని కాదంబరి కిరణ్ అన్నారు. అంతేకాక జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, కొరటాల శివగారు, రామ్ నామగిరి, బందరు బాబీగారి భార్య ఆకుల కవితగారు, ప్రవీన్ కుమార్ యాదవ్, బివి నాయుడు, ఎం ఓబులేష్, పూరి జగన్నాథ్, జువ్వాడి వెంకటేశ్వర్ రావు, వల్లభనేని అనిల్, గౌరీ శంకర్ ధార, చింతల సుబ్రహ్మణ్యం, హరీష్ శంకర్, పుట్ట గోవింద్ ఇలా అనేక మంది సహాయం చేశారు అని కాదంబరి కిరణ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios