కచ్చా బాదం సాంగ్ తో దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు భుబన్ బద్యాకర్. ఒక్క సాంగ్ తో అతడు సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయాడు. కాగా అతడు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలు కావడంతో క్షమాపణలు చెప్పాడు.
అతి సామాన్యులను సెలెబ్రిటీలు చేయగల సత్తా ఒక్క సోషల్ మీడియాకే ఉంది. సొంత ఊరిలో కూడా కనీస గుర్తింపు లేని వ్యక్తులు దేశవ్యాప్తంగా పాప్యులర్ అవుతున్నారు. వాళ్లలో దాగున్న టాలెంట్ బయకొచ్చాక ఆపడం ఎవరి తరం కావడం లేదు. సోషల్ మీడియా ప్రాభల్యం పెరిగాక వందల మంది సామాన్యులు పాపులారిటీ తెచ్చుకొని సెలెబ్రిటీలు అయ్యారు.
ఆ మధ్య బిచ్చగత్తె రాను ముండల్ సింగర్ గా పిచ్చ పాప్యులర్ అయ్యారు. రైల్వే స్టేషన్ లో పాటలు పడుతూ బిచ్చమెత్తుకునే ఆమె టాలెంట్ ని గమనించిన ఓ వ్యక్తి ఆమె పాటను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో బాలీవుడ్ ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆమెతో పాటలు పాడించారు. బుల్లితెర షోలలో ఆమె కొన్నాళ్ళు వెలిగిపోయారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కి చెందిన పల్లీ వ్యాపారి సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ఊరూరా తిరిగి వేరుశనక్కాయలు అమ్ముకునే బుబన్ బద్యాకర్ (Bhuban badyakar)వ్యాపారం కోసం సొంతగా లిరిక్ రాసుకొని ట్యూన్ కట్టుకున్నాడు. సదరు ట్యూన్ నచ్చిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన పాటను పోస్ట్ చేశాడు. ఆ ట్యూన్, లిరిక్ డెవలప్ చేసి ఓ ప్రైవేట్ సాంగ్ చేయగా అది రికార్డు సక్సెస్ సాధించింది. గత నెలరోజులుగా సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ (Kacha Badam)సాంగ్ రచ్చ చేస్తుంది. ఓవర్ నైట్ పాప్యులర్ అయిన భుబన్ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. కాగా అనుకోకుండా నోరు జారిన బుబన్ అందిరికీ క్షమాపణలు చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో భుబన్ మాట్లాడుతూ... ‘‘నేను ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సెలబ్రెటీగా మారిపోయాను. ఈ స్థితిలో పల్లీలను అమ్మితే అవమానకరంగా ఉంటుంది’’ అన్నారు. భుబన్ అన్న ఈ మాటలు ఓ వర్గాన్ని కించపరిచాయి. దీనితో విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో అతడు క్షమాపణలు చెప్పాడు.
బుబన్‌కు తాజాగా సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో అతడు మాట్లాడాడు. ‘‘ఆ మాటలను అని ఉండకూడదు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలే నన్ను సెలబ్రెటీని చేశారు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే మరోసారి పల్లీలు అమ్మడం మొదలుపెడతాను. ప్రపంచవ్యాప్తంగా అందరి నుంచి నాకు ప్రేమ లభించింది. ఈ ప్రేమ లభించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. సెలబ్రెటీగా మారినప్పటికీ సాధారణ జీవితాన్ని మాత్రమే నేను గడుపుతున్నాను. వ్యక్తిగా నేను ఏ మాత్రం మారలేదు’’ అని భుబన్ బద్యాకర్ చెప్పాడు.
