టాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. 'కబీర్ సింగ్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే రీమేక్ ని కూడా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ లో ఏ సన్నివేశాలనైతే చూపించారో.. రీమేక్ ట్రైలర్ లో కూడా అవే చూపించారు.

కానీ నేపధ్య సంగీతం డిఫరెంట్ గా ఉంది. అదే ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. జూన్ 21న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.