బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది., ఆమె ఆటోలో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరోయిన్ సాధారణ మహిళల ముంబై విధుల్లో ఆటోలో ప్రయాణిస్తూ షూటింగ్ కి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌ షబినా ఖాన్‌ కూడా ఆటోలో ప్రయాణించారు. ఇక భరత్ అనే నేను సినిమాతో బేబీ టాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వడంతో సౌత్ లో ఆమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కానీ కియారా తొందరపడకుండా నిదానంగా కథనాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక రీసెంట్ గా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో కూడా బేబీ బాలీవుడ్ లో సాలిడ్ హిట్టందుకున్న విషయం తెలిసిందే.