టాలీవుడ్ దర్శకేంద్రుడు ఒక డిఫరెంట్ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా అన్న గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన తదుపరి చిత్రం గురించి ప్రకటించారు. 50 ఏళ్లుగా మూడు తరాల హీరోలతో వర్క్ చేసి దర్శకుడిగా సెంచరీ కొట్టిన రాఘవేంద్ర రావ్ నెక్స్ట్ సినిమా మరింత కొత్తగా ట్రై చేయబోతున్నట్లు  చెప్పారు. 

"నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో." అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

చివరగా 2017లో ఓం నమో వేంకటేశాయ సినిమాకు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు ఆ తరువాత ఇంటింట అన్నమయ్య అనే సినిమాను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు,. ఇక ఇప్పుడు తన సుదీర్ఘ అనుభవంతో రాసుకున్న ఒక కొత్త కథను చూపించబోతున్నట్లు  ప్రకటించారు. ముగ్గురు డైరెక్టర్స్ - ముగ్గురు హీరోయిన్స్ అంటూ ఒక సినిమాను ఎనౌన్స్ చేశారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.